- విజయవంతమైన మహాధర్నా
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర జనసభ అధ్యక్షులు రాజారామ్ యాదవ్ పిలుపుమేరకు బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మిత్రబృందం మహాధర్నాలో పాల్గొని పూర్తి మద్దతు తెలిపింది. బీసీ యాక్షన్ ప్లాన్ ప్రణాళిక ప్రకారం తమ వెంటే ఉంటానని తెలిపారు. ఈ మహా ధర్నాలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ నాయకులు కాంటెస్ట్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్, గోవర్ధన్ యాదవ్, పెద్దలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు పాల్గొన్నారు. 33 జిల్లాల నుండి ప్రతినిధులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం 10. 20 నిమిషాల నుండి బీసీ కళాబృందం ధూంధాం పాటలతో, ఆటపాటల డ్యాన్సులతో ఉర్రుతులుగించారు. బీజీలను చైతన్య పరుస్తూ పాటల ప్రవాహం మారుమోగింది. ఈ మహా ధర్నాలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నల్గొండ, మహబూబ్ నగర్, ఇతర జిల్లాల నుండి ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. జన సభ అధ్యక్షులు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ బీసీలకు కేటాయించాలని, బీసీలను జనసంఖ్య ఆధారంగా అధికారంలో భాగస్వామ్యం కావాలని, జనగణన సమగ్ర సర్వే చేసి ఎంబీసీ జాతులు బీసీ అన్ని కులాల జన గణన న్యాయంగా జరగాలని డిమాండ్ చేశారు.

లోకల్ బాడీ ఎన్నికలు (గ్రామం, వార్డు, సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్, కార్పొరేటర్ మేయర్ అన్ని పదవుల్లో) 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంతోపాటు విద్య, వైద్యం అన్నింటిలో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, అసెంబ్లీలో పాస్ చేసి చట్టం తయారు చేయాలని డిమాండ్ చేశారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఎంబిసి అన్ని కులాల నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, జేఐసి నాయకులు సెంట్రల్ యూనివర్సిటీ జేఏసీ నాయకులు, కిరణ్ కుమార్, జిల్లా బీసీ ప్రతినిధులు అధ్యక్షులు, ముఖ్య నాయకులు రాజారామ్ యాదవ్ కు మద్దతుగా ప్రసంగించారు. ముఖ్య నాయకుల ప్రసంగాల తర్వాత ఆర్. కృష్ణయ్య మహాధర్నా ను ఉద్దేశించి ప్రసంగించారు. చట్టసభ, లోకల్ బాడీస్ ఎన్నికలతో పాటు అన్నింటా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని, ప్రజాప్రతినిధులు ఎక్కువ స్థాయిలో ఉండి అధికారం పంచుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. జ్యుడీషియల్ జడ్జిల్లోనూ బీసీలు తక్కువే ఉన్నారని, బడ్జెట్లో కేటాయింపులు ఎన్ని ఉన్నా అన్ని విధాల అగ్రవర్ణాలే వాళ్లు అనుభవిస్తున్నారని, కేవలం నాలుగైదు శాతం వరకే బీసీలకు చెందుతుందని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్, పెద్దపెద్ద పోస్టుల్లో ఉన్న నాయకులంతా అగ్రవర్ణాల వారేనన్నారు. అందులో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. మాజీ గొర్రెల కాపరుల సొసైటీ చైర్మన్ శ్రీహరి యాదవ్ ఓటర్లకు అభినందలను తెలిపిన అనంతరం ధర్నా ముగిసింది. కార్యక్రమంలో ఒంగోరూ శ్రీనివాస్ యాదవ్, లొడంగి గోవర్ధన్ యాదవ్, బేరి రామచందర్ యాదవ్, ఆర్కే సాయన్న, వెంకట్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు యాదవ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, వెంకట్ యాదవ్, పద్మశాలి సంఘం నాయకులు సాయన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.