బంగారు భవిష్యత్తుకు పూలబాట పీపుల్స్ కాలేజీ

  • వేడుకగా పీపుల్స్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
  • 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఉద్వేగం
  • నాటి ప్రిన్సిపాల్, లెక్చరర్ల భావోద్వేగం
తాండూర్ పీపుల్స్ కాలేజీ లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో ఆ కళాశాల విద్యార్థులు

నమస్తే శేరీలింగంపల్లి : తాండూర్ పీపుల్స్ కాలేజీ తమ భవిష్యత్ ను బంగారు బాటలో నడిపించిందని ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు గుర్తు చేశారు. విలువలతో కూడిన విద్యను అందించి ఉస్మానియా విశ్వ విద్యాలయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నామని అన్నారు. తమకు ఉత్తమ భోధన అందించిన యాజమాన్యం, ఉపన్యాసకులను ఎన్నటికీ మరిచి పోలేమని వ్యాఖనించారు. ఆదివారం పట్టణంలో దుర్గా గ్రాండ్యువర్ హోటల్ లో 1990లో డిగ్రీ పూర్తి చేసుకున్న బీఏ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అప్పటి ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, ఉపన్యాసకులు వి.రంగారావు, వరలక్ష్మి, బ్రిజ్ గోపాల్, తిప్పయ్య, పీడీ రాంచంద్రయ్య, లైబ్రరియన్ నారాయణ, అటెండర్లు, ప్యూన్ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తీవ్ర భావొద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యారు. ఉపన్యాసకులను విద్యార్థినీ, విద్యార్థులు సన్మానించడంమైనది.మరియు విద్యార్థిని విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని మరియు ఆటల పోటీలు నిర్వహించి మెమొంటోలు, గిఫ్టు లు అందించడమైనది.

ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి పొలిటికల్ సైన్స్ ఉపన్యాసకులు రంగారావు మాట్లాడుతూ పీపుల్స్ డిగ్రీ కళాశాల ఏర్పడినప్పటి నుండి ఇలాంటి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని ఎన్నోసార్లు నేను అనుకున్న సాధ్యపడలేదు. కానీ ఈరోజు ఈ బ్యాచ్ సంకల్పం వలన నా కళ నెరవేరిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన స్నేహ సంబంధాలు పెరగడమే కాకుండా ఒకరికి ఒకరు తోడు, నీడగా ఉండటానికి సహకరించుకోవటానికి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుందని అన్నారు. తదనంతరం తుడుం అనిల్ కుమార్ (అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం ఏ.ఐ.సి.టి.యు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ పీపుల్స్ డిగ్రీ కళాశాలలో చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులు తమ తమ జీవితాలలో ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగారని దీనికి కారణం అప్పటి మన ఉపన్యాసకులు రంగారావు, బ్రిడ్జ్ గోపాల్, నరసయ్య పన్యాసకుల ప్రేరణే ముఖ్య కారణమన్నారు, వారి ప్రేరణతో విద్యార్థుల జీవితాల్లో ఎన్నో మార్పులు, ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చిన నాగరాజ్, విష్ణు, చందు ఇతర కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here