- ‘పబ్లిక్ కనెక్ట్’ కార్యక్రమంలో కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: “పబ్లిక్ కనెక్ట్” తో అన్ని విభాగాల అధికారులను ఒకే వేదికపై తెచ్చి సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల ఎం.పి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి సహాయ, సహకారాలతో హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ లో దాదాపు 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామని, మిగిలిన పనులు అతి త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ సంధర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, కృష్ణ కాలనీ, సుభాష్ చంద్ర బోస్ నగర్, నవభారత్ నగర్, దీప్తి హిల్స్, గుట్టల బేగంపేట, వడ్డెర బస్తి, కృత్తికా లేఔట్, సిలికాన్ వ్యాలీ, హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్, ప్రకాష్ నగర్, మడినగూడా బస్తీలోని సమస్యలను తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హాఫీజ్ పెట్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు బలింగ్ గౌతం గౌడ్, అధ్యక్షులు వాలా హరీష్ రావు, వెంకట్ రెడ్డి, యాదగిరి, సంగా రెడ్డి, పరమేష్, ప్రసాద్, సుభాష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జనార్దన్, ఆంజనేయులు, సాయి, శేఖర్, మునఫ్ ఖాన్, ముక్తర్, కృష్ణా యాదవ్, ప్రసాద్, సాదిక్, సాంబయ్య, కృష్ణ, ఓ,యాదగిరి పాల్గొన్నారు.