సమస్యల పరిష్కారం దిశగా ‘కాలని కాంటాక్ట్ ‘

  • సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పిలుపు
కాలనీ లలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందుకుంటున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: సమస్యల పరిష్కారం దిశగా కొనసాగుతున్న ‘కాలని కాంటాక్ట్ ‘ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీ, కైలాష్ నగర్, వేముకుంట, విశ్వేశ్వర కాలని సాయి కాలనీలలో కాలనీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొని కాలనీ లలో సమస్యలను తెలుసుకున్నారు. సత్వరమే వాటి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

‘కాలని కాంటాక్ట్ ‘ లో భాగంగా కాలనీ వాసులతో సమావేశమైన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here