- లింగంపల్లి డివిజన్, గోపి నగర్ నుండి భారీ సంఖ్యలో బీజేపీలో చేరిన యువకులు

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అండగా తామున్నామని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. లింగంపల్లి డివిజన్, గోపి నగర్ నుండి నామ్ దేవ్ ఆధ్వర్యంలో యువకులు భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరగా..వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీ ఇన్నాళ్లుగా ప్రజలకు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గాన్ని అవినీతికి, అక్రమాలకు , భూ కబ్జాలకు అడ్డాగా మార్చారన్నారు. బి.ఆర్.ఎస్ నాయకులు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో మంజీరా పైప్ లైన్లు, రోడ్లు, డ్రైనేజీ లైన్లు, ఇళ్ళ పట్టాలు ఇచ్చిందని, అభివృద్ధి పనులు చేసిందని, ప్రజలకు సేవ చేసింది పి.జే.ఆర్, బిక్షపతి యాదవ్ మాత్రమేనని తెలిపారు.
