నమస్తే శేరిలింగంపల్లి : ప్రాపర్టీ టాక్స్ పై 90% వడ్డీని మాఫీ చేయడం సంతోషంగా ఉందని హఫీజ్ పేట్ బిజెపి కాంటెస్ట్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేష్ యాదవ్ అన్నారు.
ఈ సందర్భంగా అనూష మహేష్ యాదవ్ మాట్లాడుతూ పది రోజుల క్రితం జిహెచ్ఎంసి కమిషనర్ కి జిహెచ్ఎంసీలో బిజెఎల్పి నేత శంకర్ యాదవ్ ని కలిసి ప్రాపర్టీ టాక్స్ పై వడ్డీ మాఫీ చేయాలని, ప్రజలు కరోనా ప్రభావంతో ఆర్థిక మాన్యంతో ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని వారికి వడ్డీ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించామని తెలిపారు. దీనికి సానుకూలంగా కమిషనర్, భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించి వడ్డీ మాఫీ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.