నమస్తే శేరిలింగంపల్లి: లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో గురువారం పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన గౌడ ప్రముఖులు నాలుగు కుర్చీలు, ఒక టేబుల్ అందజేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శేరిలింగంపల్లి సేవలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో జనార్ధన్ రెడ్డి, కరుణాకర్, నర్సింహ గౌడ్, వేణు, అశోక్ గౌడ్, ప్రసాద్, సుధీర్ పాల్గొన్నారు.