- శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: క్రీజికిస్థాన్ దేశంలో నిర్వహించిన అండర్ 19 ప్రపంచ ఓపెన్ ఏషియన్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో దేశానికి బంగారు పతకం సాధించిన ఊట్ల సాయి కౌశిక్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ పాపిరెడ్డి కాలనీ వాసి ఊట్ల శ్రీనివాస్ గౌడ్ తనయుడు తండ్రికి తగ్గ కొడుకుగా, భారతదేశానికి బంగారు పతకం సాధించడం చాలా గర్వకారణమని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రపంచ పోటీలో పాల్గొని విజయవంతంగా ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహకారం అందేలా కృషి చేస్తానని తెలిపారు.