ప్రభుత్వ విప్ గాంధీనే గెలిపిస్తాం

  •  ప్రజయ్ సిటీ కాలనీ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ సిటీ కాలనీ లో కాలనీ వాసులతో  ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ  సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజయ్ సిటీ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కి మద్దతు తెలిపారు.  రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ సంధర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్ ,  మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామని తెలిపారు. సిఎం కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని, మహిళ పక్షపాతి, మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అనేక సంక్షేమ పథకాలతో అలరిస్తున్నారని, అందులో భాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ తో  పేదింటి ఆడపిల్లకు రూ. 1లక్ష 116 ఇస్తున్నారని, ఆసరా పింఛన్లు , ఒంటరి మహిళా పింఛన్లు, కేసిఆర్ కిట్, కంటి వెలుగు, రైతుబంధు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, దాత్రి నాథ్ గౌడ్, వేణు గోపాల్, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాయుడు, రామకృష్ణ గౌడ్, దామోదర్ రెడ్డి, రఘునాథ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, పూర్ణ చందర్ రావు, సునీల్, రజినీకాంత్, తిరుపతి, భాగ్యలక్ష్మి, కాలనీ వాసులు , కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here