నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లో గ్యార్వి షరీఫ్ ముబారక్ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవమని ,అందరూ సామరస్యంగా జరుపుకునే వేడుక అని , ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వి షరీఫ్ ఉత్సవం ను భక్తి శ్రద్ధలతో ,శాంతి యుతంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని, ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉరిటీ వెంకట్ రావు, చింత కింది రవీందర్ గౌడ్, పద్మారావు, ప్రవీణ్, రవీందర్ రెడ్డి, రాంచందర్, కృష్ణ యాదవ్, రవి యాదవ్, గోపాల్ యాదవ్, నటరాజు, గఫుర్, పవన్, అస్లాం, అజిమ్, మాయజన్, మెయిన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.