సమస్యలను పరిష్కరించండి

  • శ్రీరామ్ నగర్ ఏ బ్లాకులో ప్రజలతో ముఖాముఖి.. విన్నవించిన ఆయా కాలనీ వాసులు 
  • ప్రతి వీధి, వీధి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న పలు శాఖల అధికారులు
శ్రీరామ్ నగర్ ఏ బ్లాకులో నిర్వహించిన ముఖాముఖిలో ఆయా కాలనీ ల వాసులు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలతో ముఖాముఖి 100 రోజులు కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఏ బ్లాకులో జీహెచ్ఎంసి, వాటర్ బోర్డు, ఎలక్ట్రికల్ అధికారులు , సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులంతా కలసి కాలనీలోని ప్రతి వీధి, వీధి పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలోని ప్రజల వద్దకు సంబంధిత శాఖల అధికారులు వచ్చి పలు సమస్యలు గుర్తించగా.. ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ అధికారులు, స్థానిక రోడ్ల సమస్యలు తెలుసుకొన్నారు. కొన్ని చోట్ల మిగిలి ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేసి, కొద్దిగా డ్యామేజ్ కు గురైన రోడ్లను బాగు చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకుంటామని ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ డీఈ రమేష్ అన్నారు. ఎలక్ట్రికల్ స్తంభాలను, కొన్నిచోట్ల వేలాడుతున్న విద్యుత్తు కేబుళ్లను, క్రమబద్దీకరించాలని, అసౌకర్యంగా వేలాడుతున్న ప్రైవేట్ కేబుళ్లను తొలగించాలని ప్రజలు కోరారు. రెండు వీధులలో ఉన్న పాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మారిస్తే, కాలనీ మొత్తం డ్రైనేజీ సమస్యలు లేని విధంగా ఉంటుందని అసోసియేషన్ సభ్యులు వాటర్ బోర్డు శాఖా దృష్టికి ఈ సందర్బంగా తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ప్రతి అధికారి మీ కాలనీలోని ప్రతి వీధి, వీధికి వస్తున్నామని, ఏ సమస్య ఉన్న పరిష్కారిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ డీఈ రమేష్, వర్క్ ఇన్ స్పెక్టర్లు వెంకటేష్, వినోద్, శానిటేషన్ సిబ్బంది ఎస్ఎఫ్ఏ అచ్యుత్, ఎంటమాలజీ డిపార్ట్ మెంట్ సూపర్ వైజర్ అబ్దుల్ సత్తార్, శ్రీరామ్ నగర్ ఏ బ్లాకు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు జె. బలరాం యాదవ్, మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శివ కుమార్, అసోసియేషన్ సభ్యులు కృష్ణ యాదవ్, ప్రసాద్, కాలనీ వాసులు రత్నం, అవదీష్ నారాయణ, హనుమంతు రెడ్డి, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, మల్లేష్ యాదవ్, ఓబుల్ రెడ్డి, మహమ్మద్, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here