సమస్యల పరిష్కారానికి వేదిక ‘కాలనీ ల కాంటాక్ట్’ : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీ లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘కాలనీ ల కాంటాక్ట్’ వేదికవుతుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని , కాలనీల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ, వేమన వికర్ సెక్షన్ కాలనీలలో కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో డీసీ సుధాంష్ , కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా జిహెచ్ ఎంసీ, వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక్షంగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

చందానగర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

కాలనీలలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించడానికి ఇదొక చక్కటి వేదికని, ఇంచు మించు 15 శాఖల అధికారులు ఇందులో పాల్గొననున్నట్లు చెప్పారు. ప్రతి కాలనీ లో ప్రతినిధుల తో కార్పొరేటర్లు, అధికారులు సమన్వయం చేసుకొని సమస్యలు తెలుసుకొని ,త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని, కాలనీలలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి ప్రజా సమస్యలు పరిష్కారం గా ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ లలో పారిశుధ్య నిర్వహణ పై అలసత్వం ప్రదర్శించరాదని, రోడ్లు, డ్రైనేజి, మంచి నీటి సమస్య, నాల సమస్యలు, ఫూట్ ఫాత్, పార్క్ విధి దీపాలు, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, దోమల బెడద, కుక్కల బెడద రక్షణ చర్యలు, మహిళ సంరక్షణ చర్యలు, జ్వరం, ఆరోగ్య సమస్యలు, ట్రాఫిక్, పోలీస్ డయల్ 100, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్ , విద్యుత్ లైన్ లు వంటి వివిధ సమస్యల పై తెలుసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసీ అధికారులు, ఏ ఎం హెచ్ ఓ డాక్టర్ కార్తిక్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, SI శ్రీధర్, డాక్టర్ కీర్తి , SRP బాలరాజు, వర్క్ ఇన్ స్పెక్టర్ జగదీష్, జలమండలి వర్క్ ఇన్ స్పెక్టర్ కిష్టప్ప , చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా మరియు కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, నర్సింహ రెడ్డి, మల్లేష్, అనిల్, కుమార్, రమేష్, కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోయేషన్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here