- కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ను సద్వినియోగం చేసుకోవాలని హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు.
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హరిజన బస్తి/సైబర్ హిల్స్ , హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని దత్త సాయి, ఏంజెనీర్స్ ఎనక్లేవ్, జనప్రియ నగర్ 1 & 2 కాలనీ/బస్తీలోని సమస్యలను తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలనీ/బస్తీలో ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సయ్యద్ గౌస్, అర్జున్, రాజు, లక్ష్మణ్, జైపాల్, కృష్ణ, వెంకట్రామిరెడ్డి, ప్రసాద్, రమేష్, ఉమామహేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, అశోక్, రవి, జి.హెచ్.ఎం.సి డి.ఈ స్రవంతి, మాదాపూర్ ఏ.ఈ.ప్రశాంత్, హాఫీజ్ పెట్ ఏ.ఈ ప్రతాప్,హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి మేనేజర్ యాదగిరి, ట్రాన్స్కో, శానిటేషన్, హెల్త్ డిపార్ట్ మెంట్ ఇతర అధికారులు పాల్గొన్నారు.