- క్రోధి నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, శ్రేయభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్రోధి నామ నూతన సంవత్సర (తెలుగు) ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఉగాది పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ శాంతులతో గడపాలని ఆకాంక్షించారు. అదేవిధంగా షడ్రుచుల సమ్మేళనం సంబరాల సూర్యోదయం భవితల పంచాంగ శ్రవణం వసంత కోయిల గానంతోపాటు వచ్చేదే తెలుగు వారి పండగ ఉగాది అని తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలు, ఆలోచనలతో నవ వసంతం ఆనందమయం కావాలని ఆశిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికి మరొకారి శ్రీ క్రోధి నామ సంవత్సర 2024-25 తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.