- బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ కు ఆహ్వానం
నమస్తే శేరిలింగంపల్లి : కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప స్వామి కామరాతి దేవీ కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు నరసింహులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ కల్యాణ మహోత్సవానికి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ను ఆహ్వానించారు.
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోరటికల్ గ్రామంలో ఏప్రిల్ 29న ఉదయం 9 గంటలకు శ్రీ బీరప్ప స్వామి కామరాతిదేవిల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రజలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువజన నాయకులు, యువకులు, చిన్నారులు, పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలన్నారు. ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని అన్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో సంతోష్ కుర్మా, మందుల మహేష్, కుర్మా, మందులసైదులు కుర్మా, మందుల నరసింహ కుర్మా , మందుల బీరప్ప కురుమ, మందుల స్వామి కుర్మ, మాలిక్ లింగం కుర్మా, శంకర్, పాలాచి రాజు పాల్గొన్నారు.