నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ ఏ బ్లాక్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. వారు గాంధీ నివాసానికి వెళ్లి కలవగా.. నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శ్రీ రామ్ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ శివ కుమార్, ఉపాధ్యక్షులు విజయకుమార్ రెడ్డి, వెంకటేశ్వర రావు, కోశాధికారి చంద్ర మౌళి, ప్రధాన కార్యదర్శి టి. వెంకట రమణ, కార్యనిర్వహణ అద్యక్షులు మేడిశెట్టి రాము జాయింట్ సెక్రటరీ నర్సింహరెడ్డి , ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా నారాయణమ్మ, వసంత. మనోజ్, గురుమూర్తి, మహేందర్ సింగ్, ధనుంజయ, పుల్లయ్య, భాస్కర్ రావు, రాజ గోపాల్, పి, పుల్లయ్య, సలహా దారులుగా ఆకుల సోమయ్య, కే.ఏ పాత్రుడు, షేక్ కాసిన్ని పేర, సాంబ శివరావు, బంగారెడ్డి, జెటి సెక్రటరీ నర్సింహారెడ్డి, కె. శ్రీనివాస్, వాణి , డా. మల్లేష్, ప్రసాద్ రావు, రఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ:,వరాలు, సుధ , తిరుపతి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు: వసంతరావు, నారాయణమ్మ, లక్ష్మి, మహేందర్ సింగ్, రెహమాన్, టీవీ నారాయణ, ధనుజే, బి. పుల్లయ్య, ఈశ్వరయ్య, గురుమూర్తి భాస్కర్ రావు, సోమయ్య, పత్రుడు, పగిడి వేంకటేశ్వరులు, జర్నలిస్టు విజయ్ పాల్గొన్నారు.