- కార్యకర్తలకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సూచించారు. ప్రతి కేంద్రంలో పర్యవేక్షించాలని, జనవరి 6 లోపు అర్హలుందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ది కోసం దరఖాస్తున్న చేసుకోవాలని ప్రజలకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హమీద్, నియోజకవర్గ నాయకులు మహిపల్ యాదవ్, డివిజన్ నాయకులు రహీం, మునఫ్ ఖాన్, ఖాజా, ఫైజల్, అంజద్, ఇమ్రాన్ పాల్గొన్నారు.






