నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికల కమిషన్ అంజనీకుమార్ పై సస్పెన్షన్ విధించడంతో ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర నాలుగో డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె రవి గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు.