- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
- ఎమ్మెల్యే గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన లక్ష్మీ విహార్ ఫేస్ 1 , హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాలనీల అసోసియేషన్ సభ్యులు
నమస్తే శేరిలింగంపల్లి : ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆరెకపూడి గాంధీకి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ విహార్ ఫేస్ 1 కాలనీ వాసులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాలనీల అసోసియేషన్ సభ్యులు వివేకానంద నగర్ లోని ఆరెకపూడి గాంధీ నివాసంలో తనను మర్యాదపూర్వకంగా కలిసి హర్షం వ్యక్తం చేశారు. శాలువతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి మాట్లాడుతూ తన మీద విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళలా రుణపడి ఉంటనాని, తన వెన్నంటి నడిపించిన కేసీఆర్, కేటీఆర్ , బిఆర్ ఎస్ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ఉద్యమకారులకు, కార్యకర్తలకు అభిమానులకు, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరోసారి పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న చెప్పారు.