నమస్తే శేరిలింగంపల్లి : నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. భారత రాజ్యాంగ రూపశిల్పి “డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ” 67వ వర్థంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహుబుబ్ పెట్ విలేజ్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆ మహనీయునీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లడుతూ రాజ్యాంగ సృష్టి కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యంగ నిర్మాత ఆశయాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తిని భవిష్యత్తు తరాలు ఆదర్శంగా తీసుకునేలా పాటుపడదామన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సింగ్, గుండె దయానంద్ ముదిరాజ్, శ్రీధర్ ముదిరాజ్, నర్సింగ్ రావు, చిన్న, సంతోష్, సురేష్ గౌడ్, రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.