- ఇటీవల రోడ్ ప్రమాదంలో తీవ్ర గాయాలు
- విరిగిన కాళ్ళు, నడుముతో సాయిలు అవస్థ
- చికిత్స అనంతరం మంచానికే పరిమితం
- స్పందించి రూ.40 వేలు సాయమందించిన సుహృత్ ట్రస్ట్ అధ్యక్షుడు
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ పేట్ డివిజన్ సాయి నగర్ నివాసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాయిలు (సాల్మాన్) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు కాళ్లు, నడుము విరిగింది. రెండు నెలలపాటు మమత హాస్పిటల్ లో చికిత్స పొందాడు. నాలుగైదు శస్త్ర చికిత్సల అనంతరం మృత్యువుతో పోరాడి కోలుకుంటున్నాడు. ప్రమాద ఫలితంగా అతడు మంచానికే పరిమితం కాగా.. తన కుటుంబం జీవనోపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం సాయిలు బంధుమిత్రుల ద్వారా సుహృత్ ట్రస్ట్ అధ్యక్షుడు కనకమామిడి నరేందర్ గౌడ్ కి తెలియడంతో.. ఆయన వారి ఇంటికి వెళ్లి రూ. 40 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.