శేరిలింగంపల్లి లో నెమ్మదిగా తరలుతున్న ఓటర్లు
11 గం.ల వరకు కనిష్టంగా కొండాపూర్ లో 4.97 గరిష్టంగా చందానగర్ లో 13.12
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ లో పోలింగ్ సరళి క్రమంగా వేగం పుంజు కుంటోంది. తొలి రెండు గంటల్లో జంట సర్కిళ్లలో పోలింగ్ 4 శాతానికి మించలేదు. కాగా 11 గంటల వరకు జరిగిన పోలింగ్ లో కొండాపూర్ డివిజన్ వెనుకంజ లో ఉండగా చందానగర్ లో గరిష్టంగా 13.12 శాతం పోలింగ్ నమోదైంది. చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లో 6.15 మియాపూర్ డివిజన్ లో 9.29 హఫీజ్ పేట్ డివిజన్ లో 9.71 చందానగర్ డివిజన్ లో అత్యధికంగా 13.12 శాతం నమోదు కాగా సర్కిల్ సరాసరి పోలింగ్ శాతం 9.6 గా నమోదు ఉంది. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో కొండాపూర్ డివిజన్ లో అత్యల్పంగా 4.97 శాతం పోలింగ్ నమోదైంది. గచ్చిబౌలి డివిజన్ లో 6.61 శాతంగా ఉండగా శేరిలింగంపల్లి గరిష్టంగా డివిజన్ లో 7.80 శాతం నమోదైంది. కాగా సర్కిల్ సరాసరి పోలింగ్ శాతం 6.42 గా నమోదైంది.