- మొదటి రెండు గంటల్లో నాలుగు శాతం కన్నా తక్కువే
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఎప్పటిలాగానే తొలి రెండు గంటల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్దగా కనిపించలేదు. ఓ వైపు కరోనా, మరోవైపు చలి ప్రభావం కారణాలుగా తెలుస్తున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల్లో పాల్గొంటున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరినప్పటికీ మరి కొన్ని కేంద్రాలు ఓటర్లు లేక వెలవెల బోతున్నాయి. సర్కిల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 7 గం. నుండి 9 గం. ల వరకు చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లో 3.5, మియాపూర్ డివిజన్ లో 3.58, హఫీజ్ పేట్ డివిజన్ లో 3.94, చందానగర్ డివిజన్ లో 5.11 శాతం నమోదు కాగా సర్కిల్ సరాసరి పోలింగ్ శాతం డివిజన్లలో కలిపి సరాసరి పోలింగ్ శాతం 4.04 గా ఉంది. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో 2.13, గచ్చిబౌలి డివిజన్ లో 3.77, శేరిలింగంపల్లి డివిజన్ లో 4.18 శాతం నమోదు కాగా సర్కిల్ సరాసరి పోలింగ్ శాతం 3 .52 గా ఉంది.