పోలియో చుక్కలు వేయిద్దాం..పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి :  మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీలోని ఎంపీపీ స్కూల్ లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మియాపూర్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఎంపీపీ స్కూల్ లో పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు చాలని, పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యకర భవిష్యత్తుకిచ్చే భరోసా అని, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి చిన్నారుల జీవితాలలో వెలుగును నింపాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవి గౌడ్, రాణి, విజయ్ ముదిరాజ్, సెంట్రింగ్ రాజు గౌడ్, వాటర్ రాజు ముదిరాజ్, జంగం మల్లేష్, హనుమంత రావు, నరేష్ నాయక్, భీమ్ రాజ్, నిఖిల్, వైద్య సిబ్బంది కావేరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here