నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాష్ నగర్ కల్వర్టు నిర్మాణ పనులను అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమీన్ పూర్ కు వెల్లే ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రూ. 1.60 లక్షలతో కల్వర్టు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏఈ సంతోష్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.