అద్భుత విజయమిది

  • ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు
  • జాతీయ మహిళా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో మెరిసిన పిజెఆర్ మహిళా క్రీడాకారినులు
  • తెలంగాణకు 12 (గోల్డ్ 1, సిల్వర్ 7, బ్రొంజ్ 4 ) పథకాలు శుభపరిణామం 
  • కోచ్ డగ్లస్ బెర్నార్డ్, మహిళా క్రీడాకారినులను అభినందించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ప్రతిభకు పేదరికం అడ్డుకాదని , మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా వారిని ప్రోత్సహిస్తే.. అద్భుత విజయాలు సాధిస్తారని నిరూపించారు పిజెఆర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న మహిళా క్రీడాకారులు. ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రెండో జాతీయ మహిళా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2022లో 14 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. వీరితో పోటీ పడి ప్రథమ స్థానంలో నిలిచి తెలంగాణ రాష్ట్రానికి పథకాల పంట పండించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళ క్రీడాకారులను ప్రభుత్వ విప్ గాంధీ అభినందించారు. కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, మాధవరం రంగారావు లతో కలిసి వారికి పథకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసి విజయ బావుట ఎగురవేసేలా ప్రోత్సహించిన కోచ్ డగ్లస్ బెర్నార్డ్ ను ప్రత్యేకంగా అభినందించారు ఎమ్మెల్యే గాంధీ. అంతర్జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించే విధంగా కృషి చేయాలని చెప్పారు. వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచి 12 (గోల్డ్ 1, సిల్వర్ 7, బ్రొంజ్ 4 ) పథకాలు సాధించటం అద్భుత విజయమిది అన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

ప్రతిభ కనబరిచిన మహిళ క్రీడాకారినులను  అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

అండర్ 40 – (హామెర్ త్రో విభాగంలో ) సుస్మితకు గోల్డ్, జ్యోతికి సిల్వర్… అండర్ 35 లో – మానస కు సిల్వర్, స్వాతికి కాంస్యం… అండర్ 40 – ( 400, 200, 100 మీటర్ల పరుగు ) విభాగంలో మల్లీశ్వరికి వెండి, సుస్మితకు కాంస్యం… అండర్ 35 – ( 400 మీటర్ల హర్డిల్స్ ) విభాగంలో మానస పాటీలకు వెండి, (100 మీటర్ల హర్డిల్స్) విభాగంలో మమతకు కాంస్యం, 10కే వాక్ లో వెండి సాధించారు.

విజయ సంకేతం చూపిస్తూ పొందిన సర్టిఫికెట్లు, సాధించిన పతకాలతో పీజేఆర్ మహిళా క్రీడాకారినులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here