ఇరుకు గదుల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్… చిన్నారుల భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న విద్యాసంస్థలు…

  • అనుమతులు లేకుండా స్కూళ్ల నిర్వహణ
  • అంతర్జాతీయ స్థాయిలో విద్య భోదనంటూ వేళల్లో ఫీజుల వసూళ్లు
  •  అనుమతుులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: బిజెపి మైనారిటీ నేత సైఫుల్లా ఖాన్

నమస్తే శేరిలింగంపల్లి: ఇంటర్ నేషనల్ స్కూల్ పేరిట నాణ్యమైన విద్యనందిస్తామంటూ నమ్మబలికి వేలల్లో దండుకుంటున్నది ఆ స్కూల్ యాజమాన్యం. అనుమతులు తీసుకోకుండా పాఠశాలను నడిపిస్తూ .. విద్యాబోధన చేస్తూ భావి భారత పౌరుల భవిష్యత్తును బజారున పడేస్తున్నది. సరైన ఆటస్థలం లేకపోవడంతో క్రీడల్లోనూ వారు వెనుకబడే పరిస్థితి నెలకొన్నది. చిన్నారుల భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న కిడ్ జోనియా ఇంటర్ నేషనల్ స్కూల్ పై సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులకు బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ వెల్ఫేర్, వక్ఫ్, హజ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సైఫుల్లా ఖాన్ విజ్ఞప్తి చేశారు.

వివరాలు ఆయన మాటల్లో..

బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ వెల్ఫేర్, వక్ఫ్, హజ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సైఫుల్లా ఖాన్

శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎంక్లేవ్ ప్లాట్ నెంబర్ 13లో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్ జోనియా ఇంటర్ నేషనల్ స్కూల్ ను నడిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య భోదన అందిస్తామని చెబుతూ దాదాపు 60 నుంచి 80 వేల రూపాయల వరకు ఫీజులు వసూల్ చేస్తున్నారు. ఈ విషయమై ఎంఈఓ ను సంప్రదించగా.. కిడ్ జోనియా ఇంటర్ నేషనల్ స్కూల్ ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ ను నిర్వహిస్తున్నట్లు ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చారని వెల్లడించారు. సౌకర్యవంతమైన భవనం లేకపోవడం, సరైన ఆటస్థలం కల్పించపోవటంతో ఆ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న 250 మంది చిన్నారి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. శేరిలింగంపల్లిలో కిడ్ జోనియా సంస్థతో పాటు అనేక పాఠశాలలు ఇదేవిధంగా అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు వాటిపై దృష్టి సారించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

సురక్ష ఎంక్లేవ్ లో అనుమతులే లేకుండా కొనసాగుతున్న కిడ్ జోనియా ఇంటర్ నేషనల్ స్కూల్ భవనమిదే
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here