మౌళిక వసతుల కల్పనే ధ్యేయం : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్ 1 కాలనీ లో ఎన్నో ఏండ్ల నుండి నెలకొన్న డ్రైనేజి ఔట్ లెట్ సమస్యను పరిష్కరించిన శుభసందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలవాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సెంట్రల్ పార్క్ ఫేజ్ 1 కాలనీవాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజి ఔట్ లెట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కాలనీలో నెలకొన్న రోడ్లు , తాగునీటి పైప్ లైన్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సెంట్రల్ పార్క్ ఫేజ్ -1 ప్రెసిడెంట్ రామకృష్ణ కాలనీ వాసులు దేవేందర్ రెడ్డి, అశోక్ , సతీష్, కిషోర్ కట్ట, లక్ష్మీ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు చెబుతున్న సెంట్రల్ పార్క్ ఫేజ్ 1 కాలనీవాసులు, ప్రజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here