శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ సేవలు భేష్ : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • పేద విద్యార్థుల పై చదువులకు హోటల్ అధినేత సత్యనారాయణ రావు చేయూత
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇద్దరు విద్యార్థులకు రూ. 50 వేలు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: పేద విద్యార్థుల పై చదువులకు చేయూతనందిస్తున్న శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సేవలు భేష్ అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కొనియాడారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన వీరన్న యాదవ్ (లేట్) సుభద్ర కుమారుడు సుమంత్ కు రూ. 25 వేలు, మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కి చెందిన గంగాభవానీకి రూ. 25వేలను మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆ పేద విద్యార్థులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సత్యనారాయణ రావు అందజేశారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సత్యనారాయణ గొప్ప మనసున్న వ్యక్తని, మానవతా దృక్పథంతో పేద విద్యార్థుల చదువు కోసం తన వంతు సహాయంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణని శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. మంచి భవిష్యత్తును ఏర్పరచుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆర్థిక సాయం పొందిన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రమణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here