- ప్రధాని మోడీకి నారిలోకం నీరాజనాలు
నమస్తే శేరిలింగంపల్లి : నూతన పార్లమెంట్ భవనంలో మొదటి బిల్లు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ప్రధాన మంత్రి మోడీకి శేరిలింగంపల్లి ప్రజల తరపున మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ చట్ట సభల్లో కేవలం 10 % కూడా మహిళలు లేకుండా వారిని రాజకీయ వెనుకబాటుకు గురి చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఎంతో ధైర్య సాహాసాలతో మహిళలు కూడా రాజకీయంగా మగవారితో దీటుగా ఎదగాలని చట్ట సభల్లో 33 %మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించడం పట్ల దేశ మహిళలందరు మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మహిళలు రాజకీయాల్లో రావటం వల్ల చట్ట సభల్లో అవినీతి అక్రమాలు, హింస తగ్గుముఖం పడతాయని, జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన బీజేపీ ప్రభుత్యానికి, మోడీకి నారిలోకం నీరాజనాలు పడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీని బలపరచి ఆఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.