ప్రజా సమస్యల పరిష్కారంగా.. అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం

  • మధురానగర్, ప్రశాంతి హిల్స్ కాలనీలలోని పాదయాత్ర ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ప్రజా సమస్యలే పరిష్కారంగా, అభివృద్దే లక్ష్యంగా, ఇంటింటికి సంక్షేమ పథకాలు వివరిస్తూ, అభివృద్ధిని చూపిస్తూ ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో స్వయంగా ఇంటింటికి వెళ్తున్నామని తెలిపారు.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురా నగర్, ప్రశాంతి హిల్స్ కాలనీలలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మాజీ కార్పొరేటర్ సాయిబాబా, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. మధురానగర్ లోని ఎదురుగడ్డల మైసమ్మ అమ్మవారి దేవస్థానం, పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి తదనంతరం పాదయాత్ర చేపట్టారు. కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని, నాలా పూడికతీత పనులు వేగవంతం చేసి, అడ్డంకులను తొలగించి, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గచ్చిబౌలి డివిజన్ లో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని చెప్పారు. అయితే కాలనీలలో గడప గడపకు వెళ్తూ.. అవ్వలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఐటి యువకులను, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారిని ఎంపీ, ఎమ్మెల్యే పలకరించగా.. ఇక్కడి ప్రాంతం బాగా అభివృద్ధి చెందినదని, ప్రశాంత వాతావరణంలో కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు, రైతుబంధు ,రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసుతో అమలు చేస్తూ పేదల జీవితాలలో వెలుగులు నింపుతూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లు చెప్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతి కాలనీ లలో ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, డీఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, వాటర్ వర్స్క్ మేనేజర్ నరేందర్,ఎలక్ట్రికల్ ఏఈ వేణు గోపాల్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మెహ్రా , టీపీఎస్ రమేష్, చైర్మన్ జవేద్ , ఎస్ ఆర్పీ కిష్టయ్య, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, మంత్రిప్రగాఢ సత్యనారాయణ , రమేష్ గౌడ్, జగదీష్, మల్లేష్, వినోద్, రాజు, నారాయణ, గోవింద్, శ్యామ్ లెట్ శ్రీనివాస్, నవాజ్, సుధీర్ సతీష్, ఖాదర్, అనిల్, మహేందర్, ఫయాజ్, విజయలక్ష్మి, సుగుణ, బాలమణి, అరుణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here