నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులు, స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ దోమల బెడద అధికంగా ఉన్నందువల్ల డివిజన్ పరిధిలోని పలు కాలనీలవాసులు సమస్యను తమ దృష్టికి తీసుకురావడం వల్ల పటేల్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించి, జిహెచ్ఎంసి ఎంటమాలజీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఏ,ఈ గణేష్, స్థానిక నాయకులు ఉమకిషన్,విజయ్, సుప్రజా,జంగం మల్లేష్, శివ ముదిరాజ్, పాండు బోయ, నరేష్ నాయక్, ఉపేందర్ రెడ్డి, సయ్యద్ యూనుస్ , మహమ్మద్ హైమధ్ అలీ పాల్గొన్నారు.