నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పాఎన్ క్లేవ్ లో సంకష్టహర చతుర్థి సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి భక్తిశ్రద్దలతో విశేష పంచామృత అభిషేకములు, అర్చనలు చేశారు.
ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవము, రాత్రి 8-30గంటలకు అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. భక్తులు సంకష్టహర చతుర్ధికి పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.