నమస్తే శేరిలింగంపల్లి: ఆరంభ టౌన్షిప్ లో బిఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా నాయకులు అరుణ, దాసరి సరిత కలిసి జెండాని ఆవిష్కరించి, స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు జాతీయ రాజకీయాలను శాసించే దిశగా భారత రాష్ట్ర సమితి అడుగులు వేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, విక్రమ్ యాదవ్, బసవయ్య, కుటుంబరావు, జనార్ధన్, దాసరి నాగరాజు, సాయిరాం, రాందాస్, కళ్యాణ్ గౌడ్ పాల్గొన్నారు.
