ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంపై అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థిని, విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికుడు ఎం.బసవలింగం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎర్త్, ఓషియన్, అట్మాస్ఫియర్ సైన్సెస్ ఆచార్యులు ఆచార్య జి . కిషోర్ కుమార్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎర్త్, ఓషియన్, అట్మాస్ఫియర్ సైన్సెస్ ఆచార్యులు ఆచార్య జి . కిషోర్ కుమార్

వాయువుతోనే ఆయువు ఆరంభం..వాయువుతోనే ఆయువు అంతం.. నడుమన నడిచేదే నరుని జీవితం అంటారని, కానీ ఆ వాయువుని కలుషితం చేస్తున్నామని, విచక్షణా రహితంగా అడవులను నరికి వేస్తున్నామని, బుడిబుడి అడుగులతో మొదలై ఎన్నో అడుగులు వేసినా భూమిలో ఆరడుగులే శాశ్వతమని పేర్కొన్నారు. మరి దేనికోసం ఆరాటం.. సహజ ఖనిజాలను కొల్లగొట్టడం, అభివృద్ధి పేరిట కర్మాగారాలను పెంచేస్తూ పరిసరాలను కాలుష్యంతో నింపుతున్నామని, దీనివలన పీల్చే గాలి నుండి తినే ఆహారం వరకు ప్రతిది కలుషితం అయిపోయి రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు.

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న దృశ్యం

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బసవలింగం ప్రకృతి పరిరక్షణకై తమవంతు బాధ్యతగా కృషి చేస్తామని అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు, మాజీ డిప్యూటీ రిజిస్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, వెంకట ధర్మ సాగర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here