- మెడికవర్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో సదస్సు
- పాల్గొన్న అంతర్జాతీయ, జాతీయ వివిధ ఈఎన్టీ వైద్యులు
నమస్తే శేరిలింగంపల్లి : మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఈఎన్‌టీ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ కి అంతర్జాతీయ, జాతీయ వివిధ ఈఎన్టీ వైద్య నిపుణులు హాజరై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. యాంటీరియర్ స్కల్ బేస్, మిడిల్ ఇయర్ , మాస్టాయిడ్, ఇన్నర్ ఇయర్ & ఇంప్లాంట్, ఎయిర్‌వే మేనేజ్‌మెంట్ వంటి క్లిష్టమైన ప్రాంతాలలో నైపుణ్యం, పరిజ్ఞానాన్ని కన్సల్టెంట్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లతో పంచుకున్నారు. రైనాలజీ, స్కల్ బేస్ సర్జరీలో ప్రఖ్యాత నిపుణులు, మలేషియాకు చెందిన ప్రొఫెసర్ ప్రిపేగెరన్ నారాయణ్ ఈ సదస్సులో పాల్గొనడం విశేషం.
ప్రొఫెసర్ నారాయణ్ మాట్లాడుతూ, ” ఇఎన్‌టి రంగాన్ని అభివృద్ధి చేయడానికి, సహకారాన్ని పెంపొందించడానికి, ప్రాక్టీషనర్ల నైపుణ్యాలను పెంపొందించడానికి వేదికగా ఎలివేట్ ఇఎన్‌టి సమ్మిట్ నిలుస్తుందన్నారు. తన నైపుణ్యాన్ని పంచుకోవడానికి తోడ్పాటు అందించిన సమావేశాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాన్నట్లు తెలిపారు.
ఇఎన్‌టి సర్జన్ డాక్టర్ సంపూర్ణ ఘోష్ లైవ్ సర్జరీ ప్రకియలను నిర్వహించారు. ఒక రోగికి లైవ్ సర్జరీ చేసి, అధునాతన పద్ధతులు, ఉత్తమ ప్రక్రియలను చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , “ప్రత్యక్ష ప్రదర్శనలు వైద్య విద్యలో ముఖ్యమైన భాగంమని, వీటిలో పాల్గొనేవారు వాస్తవ విధానాలను చూసేందుకు, నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ సదస్సుకు హాజరైనవారి ఉత్సాహం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ఈయనతో పాటుగా ఫ్యాకల్టీ సభ్యులు కూడా తమ అభ్యాస అనుభవాలను సదస్సుకు హాజరైన వారికి చూపారు.
మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ శరత్ రెడ్డి ఎ – డైరెక్టర్ – సీటీఓ & కాంప్లెక్స్ కరోనరీ ఇంటర్వెన్షన్స్ మాట్లాడుతూ ” మారుతున్న పరిస్థితులు, వస్తోన్న నూతన సాంకేతికతలలో అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఎలివేట్ ఇఎన్‌టి సమ్మిట్ 2024 విజయం సాధించిందన్నారు. సదస్సుకు హాజరైనవారు సంక్లిష్టమైన ఇఎన్‌టి విధానాలపై లోతైన పరిజ్ఞానం పొందటంతో పాటుగా అత్యాధునిక వైద్య విధానాల పట్ల అవగాహన కూడా పెంపొందించుకున్నారని పేర్కొన్నారు.
అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ సతీష్ కైలాసం మాట్లాడుతూ ఈ ఓటోలారిన్జాలజీ, ఆడియాలజీలో నిపుణుల కోసం ఈ కాన్ఫరెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని, ఈఎన్టీ రంగంలో సరికొత్త పురోగతుల గురించి తెలుసుకునే అవకాశాన్ని అందిస్తుందన్నారు. ఈ సదస్సులో 400 మందికి పైగా నిపుణులు, యువ డాక్టర్స్ పాల్గొన్నారు.