- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు , జీహెచ్ఎంసీకి రూ. 3 వేల 65 కోట్ల నిధులు కేటాయింపుపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని, మంత్రి పొన్నం ప్రభాకర్ ని, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ తదితర డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయ లక్ష్మి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని, అనంతరం కార్యాలయ ఆవరణలో బాణా సంచా పేలుస్తూ, మిఠాయి తినిపించుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.