- పార్టీలో చేరిన యువతకు ఆహ్వానం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని మస్జీద్ బండకి చెందిన యువత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మస్జీద్ బండ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ సమక్షంలో పార్టీలో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానింంచారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి యువత బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి పధకాలను చూసి ప్రజలు ఆకర్షితులవుతున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ప్రతి డివిజన్ అభివృద్ధి బాటలు నడిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా స్థిర స్థాయిగా ఉంటుందన్నారు.