- బీజేపీ ఓటేయాలని కోరిన బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభ్యర్థి గెలుపు కోసం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరుస్తూ దేశానికి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ భారీ సంఖ్యలో జాయినింగ్ కార్యక్రమాలను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశము మొత్తం నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేయడానికి సంకల్పించిందన్నారు. ఆయన నాయకత్వంలోని భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందిందని, 2047 నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఆవిర్భవించబోతుందని రవి కుమార్ యాదవ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ కేశవరావు, అధ్యక్షులు భూపాల్ రెడ్డి, అరుణ్ ,రాజారెడ్డి, పర్వతాలు యాదవ్, బాలు యాదవ్, సాయి ,మురళి, శ్రీకాంత్ యాదవ్, గోవర్ధన చారి, రమేష్ యాదవ్, రఘునాథ్, సిద్దయ్య ,హనుమంతరావు, రవికుమార్, పవన్, కవిత మొదలగు వారు పాల్గొన్నారు.