- శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో అల్పాహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, టూరిజాం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి మాటే లేకుండా పోయిందన్నారు. సంక్షేమ పథకాలు కనుమరుగయ్యాయన్నారు. కార్పొరేట్ శక్తుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేద,మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.