నమస్తే శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ కు మద్దతుగా గచ్చిబౌలి డివిజన్ లో దర్గా నుండి టెలికాం నగర్ వరకు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ళ మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ పాల్గొని కమలానికి ఓటేసి బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30 వ తారీకున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని, అవినీతి పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. అందరీ ఆశీర్వాదంతో గెలిచి ప్రజాసమస్యల పరిష్కారానికి కృసి చేస్తానని హామీ ఇచ్చారు.
