నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ లో ని బొటానికల్ గార్డెన్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు
ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మంచి అనుబంధాలను పెంపొందించే విధంగా దోహదపడతాయని తెలిపారు.