అధికారంలోకి రాగానే పేదల దరికి 6 గ్యారంటీలు : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ 

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ లోని ప్రశాంత్ నగర్ పార్క్ లో కాంగ్రెస్ కి మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటు అభ్యర్ధించారు.

ప్రశాంత్ నగర్ పార్క్ లో ఆత్మీయ సమ్మేళనంలో జగదీశ్వర్ గౌడ్ కు మద్దతు తెలుపుతున్న దృశ్యం

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసమే 6 గ్యారంటీ లను ప్రవేశపెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే పేదల దరికి ఇవి చేరుతాయని హామీ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here