నమస్తే శేరిలింగంపల్లి: పదో తరగతిలో ఉత్తమంగా రాణించిన విద్యార్థులకు ప్రోత్సహాకాలు అందించి సత్కరించారు. పిఎన్ ఆర్ మెమోరియల్ ఫౌండషన్ చైర్మన్ మల్లిఖార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పదో తరగతి పరీక్షలో 9.2తో మొదటి స్థానం సాధించిన వై. సుగ్నేష్ , 9.0 తో ద్వితీయ స్థానం సాధించిన కే. సిందును బిఆర్ ఎస్ డివిషన్ ఉపాధ్యక్షులు క్రిష్ణ యాదవ్, బి జె పి కాంటెస్టెడ్ కార్పొరేటర్ యేల్లేష్, ఉట్లా సురేష్ ముదిరాజ్, గ్రామ అభివ్రుది కమిటీ అధ్యక్షులు రవి యాదవ్ సత్కరించి నగదు బహుమతి అందించారు. కార్యక్రమంలో సురేష్ రాతోడ్, ప్రణయ్ పాల్గొన్నారు.