- ఫిర్యాదు చేసి 15 రోజులు అవుతున్నా పట్టించుకోని అధికారులు
- ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి: ప్రజల కోసం రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: అనుమతులు లేకుండా సెల్లార్ల తవ్వకం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి సినిమా టాకీస్ నుండి అమీన్ పుర్ వెళ్లే దారిలో మెయిన్ రోడ్ నుండి కైలాస నగర్ వెళ్లే మలుపులో దాదాపు 6, 7 వందల గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వుతున్నారని గత 15 రోజుల నుండి జిహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశామని, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దారిలో దాదాపు రోజుకు 10000 మంది జనాభా తిరుగుతూ ఉంటారని, పిల్లల నుంచి ముసలోళ్ళు వరకు రాకపోకలు సాగిస్తారన్నారు. ఒకవేళ ఎలాంటి పరిస్థితిలైనా ఆ రోడ్డు వర్షానికి కోసుకుపోయి కూలిపోతే ఏంటి పరిస్థితి అని, అనిమాటి లేకుండా వెలిసిన సెల్లార్ ను పుడ్చేసి జనాలకు న్యాయం చేయగలరని కోరారు. ప్రజలకు సమస్యలు ఏర్పడితే పరిష్కరించాల్సినా పట్టించుకోని అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.