శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ షంషీగూడ ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆర్.కే. వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 350 పైగా పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఉచిత స్టడీ మెటీరియల్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద , మధ్య తరగతి విద్యార్థిని ,విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే మోడల్ పేపర్ తయారు చేయించామని, ఎవరైతే చదువులో వెనుకబడి ఉన్నారో వారికి ఈ స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు, నర్సింగ్ యాదవ్,నరసింహ చారి,కుమార్ యాదవ్ వెంకటస్వామి రెడ్డి యాదవ రెడ్డి ,సత్యనారాయణ యాదవ్ ,స్రవంతి, డాక్టర్ వంశీ రాయల్,రమేష్,సందీప్ గౌడ్,విష్ణువర్ధన్ రెడ్డి,సురేష్ ఎస్ కే చాంద్,జ్యోతి ,అనూష ,రాజు, లక్ష్మీనారాయణ అరుణ్ పాల్గొన్నారు.