మియాపూర్ సర్కిల్ ప్రజావాణిలో 6 ఫిర్యాదులు.. అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికే!

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని మియాపూర్ సర్కిల్–48 కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 6 ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ పౌర సమస్యలకు సంబంధించి ప్రజలు అందించిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల వారీగా నమోదు చేశారు. విభాగాల వారీగా చూస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 3 ఫిర్యాదులు అందగా, ఇంజినీరింగ్ విభాగానికి 2, అర్బన్ బయోడైవర్సిటీ (UBD) విభాగానికి ఒక ఫిర్యాదు అందింది. రెవెన్యూ, ఆరోగ్యం–పారిశుధ్యం, UCD, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, వెటర్నరీ విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here