చందానగర్‌లో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్‌లో విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా, భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. స్వామివారి కృపాకటాక్షాలు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అశోక్ గౌడ్, నాయకులు మిరియాల రాఘవరావు, రఘునందన్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాంగోపాల్, నాని, హరి, రాజన్, ఆయాజ్ ఖాన్, బబ్లూ తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here