శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మతి స్థిమితం లేని ఓ వృద్ధుడు ఓల్డేజ్ హోం నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చింతలపాటి ధన్‌రాజ్ (64) అనే వృద్ధుడు మియాపూర్‌లోని దత్తసాయి నగర్‌లో ఉన్న గ్రేస్ ఓల్డేజ్ హోమ్‌లో జీవిస్తున్నాడు. కాగా డిసెంబర్ 29వ తేదీన ఉదయం 11 గంటలకు అతను ఆశ్రమంలో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. కాగా అతను గత కొంత కాలంగా మతి స్థిమితం లేకుండా ఉన్నాడని, బయటకు వెళ్లినప్పుడు వైట్ అండ్ బ్లూ కలర్ షర్ట్, గ్రీన్ కలర్ లుంగీ ధరించి ఉన్నాడని, ఎత్తు 5.5 అడుగులు ఉంటాడని, రంగు చామనఛాయలో ఉంటాడని, ఎవరైనా గుర్తు పడితే తమకు సమాచారం అందించాలని మియాపూర్ పోలీసులు తెలిపారు.