శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్ సోల్స్ డే (All Souls’ Day) సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ క్రిస్టియన్ శ్మశాన వాటికలో మరణించిన తమ ప్రియమైన వారిని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్‌కు చెందిన పాస్టర్లందరూ శ్మశాన వాటికలో సమావేశమై, తమను విడిచివెళ్లిన ప్రియమిత్రులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా PAC చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఇజ్రాయేల్, యేసురాజు, సత్యరాజు, శ్యాముల్, దేవదాస్, జాషువ, నాగభూషణం, ఫిలిప్, సుమన్, ఇమ్మానుయేల్, జాన్ ఆంథోనీ, గోపి, కోకిల శ్యాముల్, సువర్తమ్మ, రమేష్, విపర్తి, దాస్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు రఘునందన్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పోశెట్టిగౌడ్, మరేళ్ళ శ్రీనివాస్, జిల్లా గణేష్, గుడ్ల శ్రీనివాస్, మల్లేష్, ఖలీమ్, నాగరాజు, మహేష్, రవీందర్, రఫీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.





